పది పరీక్షల్లో 625కు 625 మార్కులు సాధించిన అంకిత.. ఈ విద్యార్థిని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

పది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ప్రతి విద్యార్థి కల అనే సంగతి తెలిసిందే.తాజాగా కర్ణాటక రాష్ట్రం( Karnataka State )లో పదో తరగతి ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో అంకిత అనే విద్యార్థిని సత్తా చాటారు.625కు 625 మార్కులు సాధించి అంకిత సత్తా చాటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అంకిత పూర్తి పేరు అంకిత కొసప్ప కాగా ఈమె తండ్రి రైతు కావడం గమనార్హం.

 Karnataka Sslc Results Inspirational Success Story Details Here Goes Viral In So-TeluguStop.com
Telugu Ankita, Karnataka Sslc, Karnataka, Mudhol, Story-Inspirational Storys

అంకిత కొసప్ప తల్లి గృహిణి కావడం గమనార్హం.అన్ని సబ్జెక్ట్ లలోనూ అంకిత అదిరిపోయే మార్కులు సాధించారు.భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.ముధోల్( Mudhol ) తాలూకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్ లో అంకిత చదువుకున్నారు. బాలిక స్వగ్రామం వజ్జరమట్టి కాగా ఆమె మంచి మార్కులు సాధించడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.భవిష్యత్తులో అంకిత( Ankita )మరిన్ని విజయాలను సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అంకిత సాధించిన మార్కులు చూసి ఆమె నివశించే గ్రామస్తులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారని సమాచారం అందుతోంది.పేరెంట్స్, టీచర్స్ వల్లే ఈ సక్సెస్ సొంతమైందని అంకిత చెబుతున్నారు.

Telugu Ankita, Karnataka Sslc, Karnataka, Mudhol, Story-Inspirational Storys

నాకు మంచి మార్కులు రావడంతో పేరెంట్స్, టీచర్స్ ఎంతో సంతోషిస్తున్నారని అంకిత పేర్కొన్నారు.పది ఫలితాల్లో కర్ణాటకలో 7 మంది విద్యార్థులకు 624 మార్కులు వచ్చాయి.కర్ణాటక పది పరీక్ష ఫలితాలలో 6.31 లక్షల మంది విద్యార్థులు సత్తా చాటారని సమాచారం అందుతోంది.మొత్తం 8.6 లక్షల మంది ఈ ఏడాది పది పరీక్షలు రాశారని తెలుస్తోంది.కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు అంకితకు శుభాకాంక్షలు తెలియజేశారు.అంకిత టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube