మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పాలమూరుకు కేసీఆర్( KCR ) ఏం చేశారని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో( Palamuru ) ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పారు.నీళ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలంటే కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించండని విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు రావాలన్న కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణలో సుమారు 14 ఎంపీ స్థానాల్లోనైనా కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.