రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సుచించారు.
వారం రోజుల వ్యవదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.
1.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో టైం జాబ్ గురించి మెసేజ్ రావడంతో చూసి పలని కాంటాక్ట్ కావడం జరిగింది అప్పుడు గూగుల్లో రివ్యూస్ ఇస్తే మీరు ఇంటి వద్ద నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి అతను నమ్మించారు.
ఇనిషియల్ గా అతడు రివ్యూస్ ఇస్తే కొంత అమౌంట్ ని ఇచ్చారు తర్వాత టాస్క్ ల పేరుతో ఎక్కువ అమౌంట్ వస్తాయని నమ్మించి ఇన్వెస్ట్మెంట్ చేపించారు.ఆ విధంగా బాధను వద్ద నుంచి 2,10,000/- రూపాయలు మోసగించారు.
2.గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ రావడం జరిగింది కాల్ లిఫ్ట్ చేయగా ఒక అమ్మాయి వీడియో కనిపించి వీడియో కాలనీ రికార్డ్ చేసి డబ్బులు పంపించకపోతే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించడం జరిగింది దాంతో బాధితులు 1,17,000/- వేల రూపాయలను వాళ్లకు పంపించడం జరిగింది.
3.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ గురించి చూసి ఆన్లైన్లో రోజు డబ్బులు సంపాదించవచ్చు అని మెసేజ్ చూసి వాళ్ళని కాంటాక్ట్ కావడం జరిగింది టెలిగ్రామ్ లో టెలిగ్రామ్ లో అతడికి ఒక లింక్ ఇచ్చి ఐ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని అడగగా అతడు అది నమ్మి ఇన్వెస్ట్ చేశారు తొలుత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయగా రిటర్న్ ఇవ్వడం జరిగింది తర్వాత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేపించి ఆ అమౌంట్ రిటర్న్ రావాలంటే ఇంకా ఇన్వెస్ట్ చేయమని కోరడం జరిగింది సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితుడు 1,01,000/- రూపాయలు మోసపోవడం జరిగింది.
4.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాము అని క్రెడిట్ కార్డ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని కాల్ రావడం జరిగింది.కార్డు లిమిట్ పెంచడానికి ఓటిపి షేర్ చేయమనగా బాధితుడు అతడికి ఓటీపీలు చెప్పడంతో 59,000/- రూపాయలను మోసపోవడం జరిగింది.
సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
1.లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు.ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు.వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
7.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
8.పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి.
లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.