నా సినిమా నాకే నచ్చలేదు...మధ్యలోనే బయటకు వచ్చేసాను: కిరణ్ అబ్బవరం

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.ఈయన రాజా వారు రాణి గారు(Raja Varu Rani Varu) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 Kiran Abbavaram Sensational Comments On His Movie, Kiran Abbavaram, Rahasya Gora-TeluguStop.com

ఈ సినిమాలో ఈయన రహస్య గోరక్ ( Rahasya Gorak )అనే హీరోయిన్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా సమయం నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నటువంటి ఈయన ఇటీవల నిశ్చితార్థం( Engagment ) కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇలా పలు సినిమాలలో హీరోగా రాణిస్తూ ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారని చెప్పాలి.


ఇలా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి ఈయనకు వరుస ఫ్లాప్ సినిమాలు( Flop Movies ) ఎదురవుతూ వస్తున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.తాను ఒకరోజు తను నటించిన సినిమాని థియేటర్లో( Theater ) తన టీం తో కలిసి చూస్తున్నానని తెలిపారు.

ఇలా తన సినిమా చూస్తున్న సమయంలోనే ఇంటర్వెల్ వచ్చే సమయానికి ఆ సినిమా నాకు ఏ మాత్రం నచ్చలేదు.దీంతో ఇదే విషయాన్ని తన టీం కి చెప్పి బయటకు వెళ్లిపోయానని తెలిపారు.

ఇలా మీరు నటించిన సినిమానే నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోవడం సరైనది కాదు అంటూ వాళ్ళు చెప్పారు.ఎంత నా సినిమా అయినప్పటికీ బాగా లేకపోయినా బాగుందని చెప్పడం కరెక్ట్ కాదనిపించి తాను బయటకు వచ్చాను అంటూ కిరణ్ తెలిపారు.ఇలా తన సినిమా తనకే నచ్చలేదని చెప్పినటువంటి ఈయన ఆ సినిమా ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు.ఇక ప్రస్తుతం ఈయన దిల్ రుబా సినిమా( Dil Ruba Movie )లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube