ఉదయాన్నే ప్రతిరోజు నిద్రలేచి పనులన్నింటిని ప్రతి ఒక్కరు పూర్తి చేసుకుంటూ ఉంటారు.ఇలా పనులన్నీ పూర్తి చేసేవారు త్వరగా నిద్ర లేస్తారు కాబట్టి వారి పనులన్నీ త్వరగా అయిపోతాయి.
ఇంకా చెప్పాలంటే కాస్త సమయం కూడా మిగులుతుంది.అయితే కొంతమంది మాత్రం ఉదయం నిద్ర కచ్చితంగా లేవాలని అనుకొని ప్రతిరోజు ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు.
ఇలా ఆలస్యం చేయడం వల్ల పనులు ఆలస్యం అవ్వడమే కాకుండా పని చేయాలనిపించకపోవడం, యాక్టివ్ గా ఉండలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే త్వరగా లేవని చాలామంది ప్రజలు వారు ఉదయం త్వరగా లేవాలని ఎంత ప్రయత్నం చేసినా వారికి కుదరదు.దీని వల్ల కొంతమందిలో అనేక ఆరోగ్య సమస్యలు( Health problems ) కూడా వస్తూ ఉంటాయి.అయితే ఇలాంటివారు కచ్చితంగా ఇలా చేయాల్సిందే.
త్వరగా నిద్ర లేవాలనుకునే వాళ్ళు ఈ నియమాలను పాటిస్తే కచ్చితంగా ఉదయం త్వరగా నిద్ర మేలుకునే వీలు అవుతుంది.రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయం కూడా త్వరగా లేవడానికి అవుతుంది.
నిద్రపోవడానికి ఒక గంట ముందు మొబైల్ ఫోన్, లాప్టాప్ ని పక్కన పెట్టేయడం వల్ల నిద్రలేమి సమస్యలను( insomnia ) దూరం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే రాత్రి పూట కాస్త తక్కువ ఆహారం( Night Dinner ) తినడమే మంచిది.ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పడే పట్టే అవకాశం ఉంది.ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి అవ్వదు.
పైగా జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.అయితే ఇలా ప్రతి ఒక్క పనిని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఒక నెల రోజుల వరకు ఆ పని అలవాటు అయిపోతుంది.
కాబట్టి ఉదయం నిద్ర లేవాలనుకునేవారు ఉదయం లేచిన వెంటనే ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏ సమయానికి చేయాలని అనుకున్నారో వాటిని మీరు ముందే ఒక షెడ్యూల్ చేసుకుని ఉంచుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే ఈ పనులన్నీ చేయాలని మీరు ఒకరోజు ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉదయం నిద్ర త్వరగా మేలుకుంటారు.