టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఇటీవలె గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో ఒక ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో మిక్స్డ్ టాక్ ని అందుకున్న మహేష్ ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.రాజమౌళి సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ( Pan World Movie ) తెరకెక్కిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీకీ సంబంధించి ఎన్నో రకాల వార్తల వినిపించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అప్ కమింగ్ మూవీ అప్పుడే ఒక సరికొత్త రికార్డును సృష్టించింది.
ఇంతకీ ఆ రికార్డు ఏంటి అన్న విషయానికి వస్తే.రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు.మొదటి రోజు నుంచి ఈ సినిమాపై రూమర్స్ వినిపించడం సాధారణంగా మారింది.
ఈ జానర్ గురించి చాలా పుకార్లు వచ్చాయి.దీంతో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక హీరోయిన్ గురించి కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి.దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి ఇటీవల ధృవీకరించారు.అలాగే కె.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఒక అంతర్జాతీయ స్టూడియోతో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారు.ఇలా అన్ని విషయాలలో కలిపి అత్యధిక రూమర్స్ వచ్చిన మూవీగా సరికొత్త రికార్డు ను సృష్టించింది.