హైదరాబాద్ లో భారీగా కల్తీ సాస్( Adulterated sauce ) పట్టుబడింది.ఈ మేరకు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ సాస్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్( Shri Balaji Industries ) పై పోలీసులు దాడులు నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రాణాంతక రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
అదేవిధంగా ఎక్స్పైరీ అయిపోయిన సాస్ ప్యాకెట్లను సీజ్ చేశారు.ఎక్స్పైరీ అయిపోయిన సాస్ ప్యాకెట్లు, బాటిల్స్ కు కొత్త తేదీలతో స్టిక్కర్స్ వేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే సుమారు 772 లీటర్ల సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్ తో పాటు 13 కిలోల కార్న్ ఫ్లోర్ ను స్వాధీనం చేసుకున్నారు.