తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం( Sheep distribution scheme ) అక్రమాల కేసులో ఏసీబీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వారిచ్చిన సమాచారంతో ఇంకొందరిని నిందితులుగా అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న జేడీ, ఏడీ( JD, AD ) పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి రూ.2 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు.కాగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కొడుకు ఇక్రముద్దీన్( Ikramuddin ) అజ్ఞాతంలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే.