MLA Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు..!

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి( Huzurabad MLA Kaushik Reddy )పై క్రిమినల్ కేసు నమోదైంది.ఈ మేరకు ఆయనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.

 Mla Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే �-TeluguStop.com

ఈ నెల 7వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో( BRS Meeting ) పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పోలీసులు నమోదు చేస్తున్న కేసుల నేపథ్యంలో.డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో పోలీసుల మనో భావాలు దెబ్బతిన్నాయని కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube