బుల్లితెర యాంకర్ ( Anchor ) గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శ్రీముఖి ( Sreemukhi ) ఒకరు ప్రస్తుతం ఈమె వరస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు.ఇలా యాంకర్ గా కొనసాగుతూ ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అయితే తాజాగా ఉమెన్స్ డే ( Womens Day ) సందర్భంగా ఈమె చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇలా తన చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె తన తల్లికి ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన తల్లి నేడు ఈ స్థాయిలో ఉండటానికి పడిన కష్టాలను కూడా తెలిపారు.ఒక చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడింది ఒక బ్యూటిషన్ గా మొదలైన తన ప్రయాణం నేడు ఇంత మంది అభిమానులను సొంతం చేసుకునే వరకు వెళ్లి ప్రస్తుతం అమ్మ ఎంతోమంది మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.
ఇక చిన్నప్పుడు నేను కాస్త బొద్దుగా ఉంటే చాలామంది నా పట్ల బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు.అయితే అలాంటి సమయంలో అమ్మా నన్ను ప్రోత్సహించారు.నన్ను ప్రేమించింది, పాంపర్ చేసింది.ఇంకా నన్ను బలపరిచింది.త్వరలో ఆమెకి 50ఏళ్లు నిండుతాయి.ఆమె అడ్డంకులను ఛేదిస్తూ, ప్రతి రోజూ నన్ను మరింతగా ప్రేరేపిస్తుంది.
నేను ఈ జీవితానికి ఎంతో రుణపడి ఉన్నాను.ఈ మహిళా దినోత్సవంగా ఈ అద్భుతమైన రోజున ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అమ్మ అంటూ తన తల్లి లత ( Latha ) గురించి చెబుతూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.