ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా :పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ ను ఛార్జింగ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెళ్లే అవకాశాలు ఉంటాయని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు.గురువారం ఆర్థిక అక్షరాస్యతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం అవగాహన ర్యాలీని సిరిసిల్ల పట్టణం డా.

 Awareness Rally On Financial Literacy , Financial Literacy , Awareness Rally, R-TeluguStop.com

బి.ఆర్.అంబేడ్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి టి.

ఎన్.మల్లికార్జున రావు తో కలిసి జిల్లా విద్యాధికారి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను అలవర్చుకోవాలని తెలిపారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన ప్రకారం ప్రతి సంవత్సరం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రతి విద్యార్థి ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని తమ యొక్క అకౌంట్ వివరాలను గాని ఓటీపీలను గాని ఎవరితోనూ పంచుకోవద్దని పబ్లిక్ ప్రదేశాల్లోని పబ్లిక్ బ్యాటరీ చార్జెస్ ఉపయోగించరాదని తద్వారా తమ యొక్క వ్యక్తిగత వివరాలు సైబర్ నేరస్తులకు చేరుతాయని ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించారు.వివిధ పాఠశాలలు, కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో వారు పొదుపును చేసుకుని భవిష్యత్తులో వాళ్ల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఆర్ధిక అక్షరాస్యత పాటించాలని కోరారు.

పొదుపు చేయడం విద్యార్థి దశ నుండే అలవాటు కావాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీబీ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, యూబీఐ చీఫ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ఎంఈఓ రఘుపతి, డి హబ్ కో ఆర్డినేటర్ రోజా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube