ప్రస్తుతం ఏపీలో 2 లక్షల 50 వేలకు పైగా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు.వాలంటీర్ల( Volunteers ) ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి.
వాలంటీర్లుగా పని చేస్తున్న వాళ్లు తర్వాత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు( Government Jobs ) సాధించి కెరీర్ పరంగా స్థిరపడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి.అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన ముగ్గురు కూతుళ్లు వాలంటీర్లుగా పని చేస్తున్నారని ఒక తండ్రి చెప్పుకొచ్చారు.
ఒక అమ్మాయి పీజీ, ఒక అమ్మాయి సివిల్స్, మరో అమ్మాయి డిగ్రీ చదివి వాలంటీర్లుగా పని చేస్తున్నారని నా కూతుళ్ల వల్ల ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నారని ఆ తండ్రి కామెంట్లు చేశారు.ఆ వీడియోను జనసేన పార్టీ ( Janasena )సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు “నీకొక్క ఛాన్స్ ఇస్తే” వాలంటీర్ ఉద్యోగాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, యువశక్తిని నీరుగార్చేసావ్” జగన్( Jagan ) అంటూ పోస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం స్పందిస్తూ జగన్ వాలంటీర్ల ఉద్యోగాలతో యువతను గ్రామాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు.
వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించకుండా జగన్ చేస్తున్నారని పవన్ వెల్లడించారు.యువతలో ఉన్న సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించడంలో విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు.డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లతో వైసీపీ ఊడిగం చేయించుకుంటోందని పవన్ కామెంట్లు చేశారు.
5,000 రూపాయలకు పని చేయడం అంటే ఇది ఉద్యోగమా? ఊడిగమా? అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు.టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena Alliance ) నేపథ్యంలో విజయం తథ్యమని పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.