వేసవికాలంలో కీరదోసను( Keera ) సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.వేసవికాలంలో వేడి వాతావరణం తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే తీగజాతి కూరగాయ పంటలలో కీర దోస పంట కూడా ఒకటి.
అయితే ఈ పంట సాగు విధానంపై అవగాహన ఉంటే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.వేసవికాలంలో ఈ పంటను సాగు చేయాలనుకుంటే డిసెంబర్ రెండవ వారం నుంచి మార్చి నెల వరకు విత్తుకోవచ్చు.
ఉష్ణోగ్రత ఎక్కువైతే మగ పూలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మొక్కలు రెండు లేదా నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు 10 లీటర్ల నీటిలో మూడు గ్రాముల బోరాక్స్( Borax ) కలిపి పిచికారి చేయాలి.
వేసవికాలంలో కూర దోస, పచ్చి దోస, జపనీస్ లాంగ్ గ్రీన్, పూస సన్యోగ్, కో-1 లాంటి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.హైబ్రిడ్ రకాలను సాగు చేయాలనుకుంటే.నాందరి, అభిజిత్, గోల్డెన్ గ్లోరి( Nandari, Abhijit, Golden Glory ) లలో ఏదో ఒక దానిని సాగు చేయాలి.
కీరదోస పంటకు గుమ్మడి పెంకు పురుగుల బెడద కాస్త ఎక్కువ.వీటిని సకాలంలో గుర్తించి తొలి దశలోనే అరికట్టాలి.పెద్దపురుగులు మొక్కలు మొలకెత్తిన తర్వాత లేత ఆకుల దళాలను ఆశించి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి.తీగ పాకే సమయంలో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి.
ఈ పురుగులను పంట పొలంలో గుర్తించిన తర్వాత నివారణ కోసం ఐదు శాతం ట్రైక్లోఫోరాన్ పొడి( Tricloforan powder ) మందులు పొలంలో పది రోజులకు ఒకసారి చల్లాలి.1.2 మి.లీ డైక్లోరోవాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.కీర దోస మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఇలా నాటుకుంటే ఏవైనా చీడపీడలు లేదా తెగుళ్లు ఆశిస్తే సకాలంలో గుర్తించే అవకాశం ఉంటుంది.
తొలి దశలో వీటిని అరికడితే మంచి దిగుబడులు పొందవచ్చు.