నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty )… 33 ఏళ్ల ఈ నటుడు తన సినిమా కెరియర్ మొత్తంలో కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే మెయిన్ లీడ్ పాత్రల్లో నటించాడు.సివిల్ ఇంజనీరింగ్ చదివి ఇంగ్లాండులో మంచి ఉద్యోగం లో స్థిరపడిన నవీన్ ఆ ఉద్యోగంతో హ్యాపీగా లేక నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండియాకి వచ్చేసాడు.
అయితే 2012లో మొట్ట మొదటిసారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలో నటించాడు.ఆ తర్వాత డి ఫర్ దోపిడీ, వన్ నేనొక్కడినే వాటి చిత్రాల్లో కూడా చిన్న పాత్రలోనే నటించాడు.
ఇలా చిన్న సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే అతడికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ( Agent Sai Srinivasa Athreya ) అనే ఒక చిత్రం వచ్చింది.ఈ సినిమాతో మొట్టమొదటిసారి మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం విజయం సాధించి అతని హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తించడం మొదలుపెట్టింది.

ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో చిచోరే అనే మరో చిత్రంలో కూడా సహాయక పాత్రలోనే నటించాడు.ఇక తన మూడో చిత్రం జాతి రత్నాలు( Jathi Ratnalu ).ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒక మంచి కామెడీ ప్రాధాన్యత ఉన్న చిత్రంగా పేరు సంపాదించుకోగా తన తీసిన నాలుగవ సినిమా మిస్ పోలిశెట్టి .మిస్టర్ శెట్టి .దీని తర్వాత అనగనగా ఒక రాజు( Anaganaga Oka Raju ) అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.మరి ఇంత భారీ కెరియర్లో కేవలం అరడజన్ కి పైగా సినిమాల్లో మాత్రమే నటించినా నవీన్ ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నాడు అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నవీన్ చాలా మిడిల్ క్లాస్ కుటుంబం( Middle Class Family )లో పుట్టి పెరిగిన వ్యక్తి.తను సినిమా చూడాలంటే అసలు డబ్బులు ఉండేవి కాదు.

ఎవరైనా ఫ్రెండ్స్ సినిమాకు వెళ్తున్నారని విషయం ముందే తెలిసి సరిగ్గా అదే సమయానికి ఫోన్ చేసి వెళ్లి కలిసే వాడట.సినిమాకి వెళ్తున్నాం రారా అంటూ వారు అతనిని కూడా సినిమాలకు తీసుకెళ్లేవారట.అలా అంత కష్టంగా సినిమాలు చూసేవాడట.సినిమా అంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా చూసే స్తోమత లేకపోవడంతో తాను కూడా నటించే సినిమాలు చాలా కష్టం మీద ఎంతో మంది వచ్చి చూస్తారు కాబట్టి ప్రతి సినిమా క్వాలిటీతో తీయాలని, ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా తీసే ప్రతి సినిమా హిట్ కావాలని నవీన్ ఇలా తక్కువ చిత్రాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట.