అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున నామినేషన్ దక్కించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీపడగా వీరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు.
రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్స్ కోసం పోటీపడిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్,( Florida Governor Ron DeSantis ) భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిలు పోటీలోంచి తప్పుకున్నారు.వీరిద్దరూ ట్రంప్‌కే మద్ధతు పలికారు.
దీంతో భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కరే ట్రంప్‌తో తలపడుతున్నారు.తాజాగా డొనాల్డ్ ట్రంప్ గురువారం నెవాడా రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ కాకస్‌లో విజయం సాధించారు.
అయితే నిక్కీ హేలీ మాత్రం నెవాడాలో జీవోపీ నామినేషన్‌కు సంబంధించి కాకస్‌లను దాటవేశారు.ఈ ప్రక్రియ ట్రంప్‌కు అనుకూలంగా వుందని హేలీ ఆరోపించారు.
ఇప్పటికే నెవాడా ఓటర్లు నిక్కీకి షాకిచ్చారు.రిపబ్లికన్ అభ్యర్ధిత్వం కోసం జరిగిన ప్రైమరీలో నిక్కీహేలీకి ( NikkiHaley )ప్రత్యర్ధులు ఎవరూ లేకపోయినా ఓటర్లు ఆమెను తిరస్కరించారు.నిక్కీకి ఓటు వేయకుండా ‘None of these candidates’ (భారతదేశంలో నోటా లాంటిది ) బటన్ నొక్కారు.నిక్కీ హేలీకి 32 శాతం ఓట్లు రాగా.నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పోలై ఆమె ఓడిపోయారు.ఇది అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
నెవడా రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వాల కోసం ప్రైమరీలు జరగాయి.డెమొక్రాట్ పార్టీలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించగా.
రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు పోటీ చేయలేదు.నిక్కీ ఒక్కరే పోటీ చేశారు.
కానీ ఆమెకు ఓటర్లు ఎవ్వరూ ఊహించని విధంగా షాకిచ్చారు.
నెవాడాలో ట్రంప్ విజయం ఆయనకు 26 మంది రాష్ట్ర ప్రతినిధులను అందిస్తుంది.అధికారికంగా పార్టీ నామినేషన్‌ను కైవసం చేసుకోవడానికి 1215 మంది డెలిగేట్‌లు వుండాలి , మార్చిలో ఆ సంఖ్యను ట్రంప్ చేరుకునే అవకాశాలు వున్నాయి.కాకస్‌లో ట్రంప్‌కు ఓటేసేందుకు ఆయన మద్ధతుదారులు గురువారం భారీగా వేచి వున్నారు.
రెనో ఏరియా ఎలిమెంటరీ స్కూల్‌లోని కాకస్ సైట్‌లో, కాకస్‌లు తెరిచిన 20 నిమిషాల తర్వాత దాదాపు 1000 మంది వ్యక్తులతో కూడిన క్యూ మరింత విస్తరించింది.వీరిలో కొందరు ట్రంప్ టోపీలు, చొక్కాలు ధరించి కేరింతలు కొట్టారు.
రిపబ్లికన్ అధ్యక్ష రేసులో విజయం సాధించేలా ట్రంప్‌కు మద్ధతు ఇవ్వడానికి తాము వచ్చామన్నారు.