ఏపీలో ఎన్నికల పోరుకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం అయ్యాయి.వైసిపి( YCP ) వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తుండడంతో, ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేసే విధంగా టిడిపి, జనసేనలు సైతం స్పీడ్ పెంచాయి.
ఇప్పటికి పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు పంపకాలపై ఒక అవగాహనకు వచ్చాయి.కానీ అభ్యర్థుల ప్రకటన మాత్రం చేయడం లేదు.
దీనికి కారణం టిడిపి జనసేన కూటమిలో బిజెపి( bjp ) కూడా వచ్చి చేరుతుందనే ఆశ ఉండడమే.గత కొద్ది రోజులుగా బిజెపితో పొత్తు కోసం అటు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ), ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నా, బిజెపి నుంచి మాత్రం ఏ క్లారిటీ రావడం లేదు.
జనసేనతో పొత్తు కొనసాగిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి, జనసేనతో( TDP , Jana Sena ) కలిసి వెళ్తేనే మంచిదనే అభిప్రాయాలు మెజారిటీ ఏపీ బీజేపీ నేతలు నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపి అధిష్టానం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.దీంతో టిడిపి అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు విషయమై ఒక క్లారిటీకి వచ్చేందుకు నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.అక్కడ బిజెపి పెద్దలను కలిసి పొత్తుల అంశంపై చర్చించి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో బాబు ఉన్నారు.

బిజెపి నుంచి సరైన క్లారిటీ వచ్చిన తర్వాత సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సాధించాలని నిర్ణయించుకున్నారు.బిజెపి కూడా తమతో పొత్తుకు సిద్ధమైతే, మరోసారి సీట్ల పంపకాల విషయమై బిజెపి ,జనసేన లతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుని, సీట్ల పంపకాలు, అభ్యర్థుల పేర్ల ప్రకటన వంటి విషయాలపై పూర్తిగా దృష్టి సారించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు .ఏది ఏమైనా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.