టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా ఎట్టకేలకు ఆ వార్తలు నిజమే అని మహేష్ బాబుతో ఒక సినిమాను చేయబోతున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించేశారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.వీలైనంత తొందరలోనే ఈ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు రాజమౌళి.
మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి.ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయినట్లు విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) ప్రకటించారు.
ఇప్పుడిప్పుడే ఈ చిత్ర ఫైనాన్స్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి.

అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏంటంటే మహేష్ బాబు ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది ఆసక్తిగా మారింది.రాజమౌళి రెండేళ్ల వరకు మహేష్ బాబు డేట్స్ బ్లాక్ చేశారట.రెండేళ్ల పాటు డేట్స్ బ్లాక్ చేయడం అంటే అది కూడా సూపర్ స్టార్ డమ్ ఉన్న మహేష్ లాంటి హీరోకి భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పాలి.
ఇది కాస్త జక్కన్నని కలవర పెడుతున్న అంశం అట.రెండేళ్ల డేట్స్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ అంటే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది.అయితే మహేష్ బాబు 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ల పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట.కానీ రాజమౌళి, తన కెరీర్ లో ఈ చిత్రం ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం కావాలనేది మహేష్ కోరిక.

అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనేది మహేష్ ఆలోచన.అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఈ చిత్రానికి పార్ట్నర్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ ( KL Narayana )నిర్మాత అయినప్పటికీ ఫైనాన్స్ వ్యవహారాలన్నీ జక్కన్నే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.మహేష్ బాబు కూడా రాజమౌళి ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా పూర్తయ్యే వరకు తనకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదని మహేష్ అంటున్నారట.ఈ వార్తలపై నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.