మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని తెలిపారు.
తాము ముళ్లబాట చూశాం.పూలబాట చూశామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు.
1.8 శాతం ఓట్లతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలిపారు.దళితబంధు, బీసీ బంధుతో ఇబ్బంది పడ్డామన్నారు.
అయితే కాంగ్రెస్( Congress ) అప్పుడు ప్రచారంలో అబద్ధాలు చెప్పిందన్న హరీశ్ రావు నేడు ప్రభుత్వంలో అసహనాలు ఉన్నాయని విమర్శించారు.గతంలో దావోస్ దండగ అన్న వారు దావోస్ వెళ్లొచ్చారన్నారు.
ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఆరు గ్యారంటీలను ( Six guarantees )అమలు చేయండని తెలిపారు.ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వం వెంటపడుతామని స్పష్టం చేశారు.