తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సెక్యూరిటీ సిబ్బందిని ఇంటెలిజెన్స్ మార్చింది.మాజీ సీఎం కేసీఆర్ ( Former CM KCR )దగ్గర పని చేసిన ఏ ఒక్క పోలీస్ అధికారి సిబ్బందిని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.సమాచారం బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో పాటు ముఖ్యమంత్రి భద్రతపై ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించింది.
అనంతరం ఐఎస్ డబ్ల్యూ అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం మార్చివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.