మిస్టర్ పర్ఫెక్ట్… ఈ పేరులో ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో జీవితంలో అంతే పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు.ఎవరైనా సరే ఏదో ఒక చోట ఏదో ఒక తప్పు చేస్తూ వారి పర్ఫెక్షన్ కి డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే జీవితం అలా ముందుకు వెళుతూ ఉండాలి అంటే పర్ఫెక్షన్ తో సాధ్యమయ్యే పని కాదు.అయితే బాలీవుడ్ లోనే మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్( Aamir Khan ) కూడా అంత పర్ఫెక్షన్ ఏమీ కాదు.
సినిమాల్లో మాత్రమే అతడు కరాకండిగా ఉంటాడు.సినిమాకి ఏది కావాలన్నా చేస్తాడు ఫిజిక్ నీ ఎలా అయినా మలిచి సినిమా కోసం కష్టపడతాడు.
అమీర్ ఖాన్ కూడా వ్యక్తిగత జీవితంలో అలాగే రిలేషన్షిప్స్, ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు.తన జీవితానికి ఇప్పటికీ సరైన లవ్ దొరకలేదు అనే అభిప్రాయంతో ఉంటాడో ఏమో కానీ ప్రతిసారి కొత్తగా ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు.
రీనా దత్త( Reena Datta )తో మొదట ప్రేమలో పడి 1986లో పెళ్లి చేసుకున్నాడు.ఇద్దరు పిల్లలు పుట్టాక అమీర్ ఖాన్ కి మళ్లీ ప్రేమ కావాల్సి వచ్చింది.పూజ బట్( Pooja Bhatt ) తో చాలా ఏళ్లపాటు రిలేషన్ సాగించాడు.దాంతో రీనాతో బంధం విడాకులతో ముగిసింది.పోనీ పూజతో అయినా సెటిల్ అవుతాడా అంటే అది జరగలేదు.కొన్ని రోజుల పాటు వీరి రూమర్స్ మీడియాలో నానుతూ వచ్చాయి.
ఆ తర్వాత పూజ మరియు అమీర్ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు.ఆ తర్వాత ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ అయినా జెస్సికా తో ప్రేమాయణం కొనసాగించాడు.
ఒక మూవీ సెట్ లొకేషన్ లో వీరు మొదటిసారి కలవగా ఆ తర్వాత డేటింగ్ చేస్తూ లివిన్ రిలేషన్షిప్ లోకి కూడా మూవ్ అయ్యారు.దాంతో జెస్సికా గర్భవతి కూడా అయింది అని వార్తలు వచ్చాయి అబార్షన్ చేయించుకోవడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ అనేక వార్తలు బాలీవుడ్ వండి వార్చింది.
ఆ తర్వాత ప్రీతి జింటా తో కూడా ఆమీర్ ప్రేమాయణం నెరిపాడు అనేది మరొక వార్త.మీరు కూడా ఒక సినిమాలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారట కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్ పోయి వీరిని బంధం కూడా ముగిసిపోయింది.ఆ తర్వాత లగాన్ సినిమా షూటింగ్ లో కిరణ్ రావ్ పరిచయమయ్యింది.అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ చిత్రానికి పని చేసిన ఆమెతో అమీర్ ఖాన్ మరోమారు ప్రేమలో పడ్డాడు.2005 లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2021లో 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు ఎందుకు కారణం మరోమారు ఆమిర్ ఖాన్ ప్రేమలో పడటమే అని గుసగుసలు వినిపించాయి.దంగల్ సినిమాలో గీతా పోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సన షేక్) Fatima Sana Shaikh ) తో అమిర్ ఖాన్ క్లోజ్ గా ఉండటాన్ని తట్టుకోలేక కిరణ్ విడాకులు అడిగింది అనేది వార్తల సారాంశం.
ఇన్ని ప్రేమలు ఇన్ని పెళ్లిళ్ల తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరుకు ఆమీర్ ఖాన్ న్యాయం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదు.ఎందుకంటే ఎవరు జీవితంలో అంత పర్ఫెక్ట్ గా ఉండలేరు.