సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది యంగ్ హీరోలు( Young heroes ) తమకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ కూడా ఒక మంచి సక్సెస్ ని అందుకోవాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు.
ఆయన హీరోగా రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఇప్పుడు ఎలాంటి సబ్జెక్టుని సినిమాగా ఎంచుకోవాలనే డైలమా లో పడ్డట్టుగా తెలుస్తుంది.ఇక వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆయనకు సరైన సక్సెస్ పడలేదు.
ఇక దాంతో ఇప్పుడు ఆయన కెరియర్ అనేది ఫుల్ డైలామాలో పడిపోయింది.
ఇక చాలా అంచనాలు పెట్టుకున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా( extraordinary movie ) సైతం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన చాలా వరకు నిరశపడ్డట్టుగా తెలుస్తుంది.మరొక సినిమాతో సక్సెస్ సాధించి తన స్టామిన ఏంటో మరోసారి ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు యంగ్ హీరోలైన నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోలు వరుసగా సక్సెస్ లు కొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే నితిన్ మాత్రం చాలావరకు డీలా పడిపోతున్నాడు.
ఈయనకి ప్లాప్ సినిమాలు ఇంకా ఒకటి రెండు పడినట్లు అయితే నితిన్ కెరీర్ అనేది చాలావరకు డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంది.అందువల్లే నితిన్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఆయన ఒక సినిమా చేయాలి అంటే ఇప్పుడు కథ ని డైరెక్టర్ ని బాగా స్టడీ చేసిన తర్వాతే సినిమా షూట్ కి వెళ్ళబోటున్నట్టు గా అర్థమవుతుంది.ఇక వెంకీ కుడుములతో చేసే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.