మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను మంత్రి దామోదర రాజనర్సింహా స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతానికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర పేర్కొన్నారు.గత ఇందిరమ్మ రాజ్యంలోనూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లామని చెప్పారు.
వ్యవస్థను ఎంత పటిష్ట పరిస్తే అంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఆయన రాబోయే తరాలు కూడా గుర్తు పెట్టుకునే విధంగా నాయకుల పాలన ఉండాలని వెల్లడించారు.