యాదాద్రి భువనగిరి జిల్లా: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు యాదాద్రి జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కొంగరి మారయ్య అధ్యక్షతన జరిగిన సంఘం మండల కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఇసుక అందుబాటులో లేక పోవడం,
స్టీల్, సిమెంటు ధరలు పెరగడంతో నిర్మాణ పనులు సజావుగా జరగడం లేదన్నారు.
పాలకులు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వారికి ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నెల్లకంటి జంగయ్య, నాయకులు రాచకొండ నరసింహ, గాలయ్య, ఆంజనేయులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.