ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ( Bigg Boss Season 7 )లోకి కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చివరికి సీజన్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక పల్లవి ప్రశాంత్ గెలిచిన రోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన జరిగిన రచ్చ మామూలుగా లేదు.
ప్రశాంత్ గెలిచిన తర్వాత అభిమానులు కార్ల ఆద్దాలను ధ్వంసం చేస్తూ రచ్చ రచ్చ చేశారు.ఇక పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేయడం బెయిల్ పై బైటికి రావడం ఇవన్నీ జరిగాయి.
అయితే పల్లవి ప్రశాంత్ కు సింగర్ బోలే షావలి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే ( Bhole shavali )పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ అరెస్ట్ వలన చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, అసలు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళానా అని ఏడ్చినట్లు తెలిపాడు.అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చెప్పి షాక్ కు గురిచేశాడు.
ఈ సందర్భంగా బోలే షావలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా బయటకు రాగానే అతడికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.
హీరోగా రైతుబిడ్డను పరిచయం చేయాలనీ అనుకున్నారు.
చాలామంది వ్యాపారవేత్తలు లక్షల్లో గిఫ్ట్స్ పంపిస్తామని అన్నారు.రైతుబిడ్డ హీరోగా చేస్తే ఆ సినిమాకు నేనే సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు.కానీ, ఇంతలోనే ఆ అరెస్ట్, రచ్చ అంతా జరిగిపోయింది.
ఈ ఘటనతో పల్లవి ప్రశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.
బిగ్ బాస్ కు వెళ్లకపోతే బావుండేది అన్న అంటూ చెప్పాడు.ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చాకా అభిమానులు అతడి పై పెట్టుకున్న నమ్మకం చూసి చాలా సంతోషపడ్డాడు.
త్వరలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ముందుకు వస్తా అని చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.