మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )భోళా శంకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచాడు.ఆ సినిమా ఫలితం నేపథ్యం లో చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ముఖ్యంగా రీమేక్ ల జోలికి వెళ్లవద్దు అనుకున్నాడు.అందుకే బ్రో డాడీ సినిమా రీమేక్ చేయాలి అనుకుని పక్కకు పెట్టాడు.
అంతే కాకుండా మరి కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలను కూడా మధ్య లో వదిలేశాడు.ఎట్టకేలకు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర అనే సినిమా( Viswambhara ) ను చేసేందుకు ఓకే చెప్పాడు.
ఇప్పటికే విశ్వంభర సినిమా( Viswambhara movie ) మొదటి షెడ్యూల్ పూర్తి అయింది.రెండో షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఒకటి రెండు రోజుల్లో మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.మొదటి షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు.దాంతో రెండో షెడ్యూల్ లో తప్పకుండా చిరంజీవి పాల్గొంటాడు అని అంతా అనుకున్నారు.కానీ చిరంజీవి రెండో షెడ్యూల్ కి కూడా అందుబాటులోకి రావడం లేదు.
మూడో షెడ్యూల్ అంటూ ఫిబ్రవరి లో జరుగబోతున్న షెడ్యూల్ కి చిరంజీవి అందుకుంటాడు అనే వార్తలు వస్తున్నాయి.
మొన్న వెంకటేష్ సైంధవ్ సినిమా( Saindhav Movie ) వేడుకలో పాల్గొన్న చిరంజీవి ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.అయినా కూడా విశ్వంభర సినిమా షూటింగ్ కు ఎందుకు హాజరు అవ్వడం లేదు అంటూ కొందరు ఈ సందర్భంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.కారణం ఏంటి అంటే ఆయన చేతికి అయిన గాయంకు ఆపరేషన్ చేయించుకున్నాడు.
అది పూర్తిగా నయం అయ్యే వరకు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు.అందుకే ఫిబ్రవరి వరకు పూర్తి విశ్రాంతిలోనే చిరంజీవి ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.