అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన అమర్.. ఆ పని చేయమంటున్న ఫ్యాన్స్?

బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచినటువంటి బుల్లితెర నటుడు అమర్ ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

 Bigg Boss Runner Amar Deep Fans Request Him On That Matter , Bigg Boss, Amar Dee-TeluguStop.com

ఇక ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అమర్ (Amar ) అనంతపురం వెళ్లి అక్కడ అభిమానులను కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చారు.

ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనతో ఇంటర్వ్యూలు చేయడానికి ఎంతోమంది తన ఇంటి వద్దకు వెళ్ళగా అమర్ మాత్రం ఎవ్వరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు.అసలు ఈయన ఎక్కడికి వెళ్లారనే విషయం కూడా తెలియదు.

ఇన్ని రోజులు అందరికీ దూరంగా ఉన్నటువంటి అమర్ తాజాగా వెలుగులోకి వచ్చారు. ఈయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది.

తాజాగా అరియానా(Ariyana) తో కలిసి అమర్ దిగినటువంటి ఫోటోలు ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Telugu Amar Deep, Ariyana, Bigg Boss, Fans-Movie

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈమె అమర్ గురించి పోస్ట్ చేస్తూ.అమర్ నువ్వు నిజం రా.నువ్వే రియల్ హీరో అంటూ అమర్ గురించి ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఈ విధంగా చాలా రోజుల తర్వాత అమర్ కనిపించడంతో సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు ఆయనని ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నారు.అన్న మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండండి అంటూ ఈయనకు సలహాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక న్యూ ఇయర్ పూర్తి అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోబోతున్నారని తెలుస్తుంది.మరి అప్పుడైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటారా లేకపోతే అందరిని అవాయిడ్ చేస్తారా అనేది తెలియాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube