అక్రమ మార్గాల్లో అమెరికాలో( America ) అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు( Indians ) అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
రెండు రోజుల క్రితం నికరాగ్వాకు బయల్దేరిన 300 మంది భారతీయులతో కూడిన విమానం ‘‘మానవ అక్రమ రవాణా’’( Human Trafficking ) అనుమానాలతో నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లో చిక్కుకున్న తర్వాత మంగళవారం భారతదేశానికి తిరిగి వచ్చింది.ఓ విమానం భారత్ నుంచి అక్రమ వలసదారులను తీసుకెళ్తున్నట్లుగా ఫ్రెంచ్ అధికారులకు సమాచారం అందడంతో చలోన్స్ వాట్రీ విమానాశ్రయంలో “donkey flight”ను నిలిపివేశారు.
సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వా( Nicaragua ) నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య పెరగడంతో తాజా ‘విమానం’ లింక్ అంతర్జాతీయంగా విస్మయం కలిగించింది.

“donkey route” అంటే ఏమిటీ :
వివిధ దేశాలలో స్టాపింగ్ పాయింట్స్ ద్వారా అక్రమంగా సరిహద్దులను దాటడమే ఈ donkey route. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్‌లోని స్కెంజెన్ ప్రాంత సందర్శన కోసం టూరిస్ట్ వీసాను సులభంగా పొందొచ్చు.దీని ద్వారా 26 దేశాలలో స్వేచ్ఛగా వెళ్లడానికి వీలు కలుగుతుంది.
ఆపై కన్సల్టెంట్స్ ద్వారా ఏజెంట్ల సహాయంతో చట్టవిరుద్ధంగా యూకేలోకి( UK ) ప్రవేశించవచ్చు.ఈ ఏజెంట్లు నకిలీ డాక్యుమెంటేషన్ నుంచి షిప్పింగ్ కంటైనర్లలో అక్రమ రవాణా వరకు అధిక రుసుములను వసూలు చేస్తారు.

ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు తమ ప్రాణాలకు ముప్పు వున్నప్పటికీ యూఎస్, కెనడా, యూరోపియన్ దేశాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూసీబీపీ) డేటా ప్రకారం అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య రికార్డు స్థాయిలో 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు .వీరిలో 30,010 మంది కెనడా సరిహద్దుల్లో.( Canada Border ) 41,770 మంది యూఎస్ మెక్సికో బోర్డర్‌లో( US Mexico Border ) పట్టుబడ్డారు.
నివేదికల ప్రకారం.ఈ ‘‘ donkey route ’’ ఈక్వెడార్, బొలీవియా, గయానా వంటి లాటిన్ అమెరికన్ దేశానికి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది.ఇక్కడ భారతీయులు వీసా ఆన్ అరైవల్, టూరిస్ట్ వీసాలను సులభంగా పొందవచ్చు.కొందరు ఏజెంట్లు దుబాయ్ నుంచి మెక్సికోకు నేరుగా వీసాలు ఏర్పాటు చేస్తారు.
మెక్సికోలో ఈ తరహా ల్యాండింగ్ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.స్థానిక అధికారులు వలస వచ్చినవారిని అరెస్ట్ చేసే అవకాశం వుంది.
ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాలో పట్టుబడుతున్నప్పటికీ.మానవతా దృక్పథంతో అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.
వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే బహిష్కరణకు గురవుతున్నారని కేంద్ర ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ సంస్థలు చెబుతున్నాయి.