టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో ఉన్నటువంటి వారిలో నటి శ్రీలీల ( Sreeleela ) ఒకరు.హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో బిజీగా ఉన్నటువంటి ఈమె నటించిన సినిమాలన్నీ ప్రతినెలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ ఉండేవారు అయితే తెలుగులోకి పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమె నటన అందచందాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ( Ravi Teja ) హీరోగా నటించిన ధమాకా సినిమాలో అవకాశం అందుకున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీ లీలకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి.ఈ సినిమాల్లో ద్వారా ఈమె చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక శ్రీలీల ఇలా నటించినటువంటి స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో రామ్ హీరోగా నటించారు.బోయపాటి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా తర్వాత అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది.అయితే నవంబర్ నెలలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆది కేశవ( Aadikeshava ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక డిసెంబర్లో వక్కంతం వంశీ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది ఇలా ప్రతి నెల విడుదల కానున్న నేపథ్యంలో నేటిజన్స్ భారీ స్థాయిలో ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమాలోని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ప్రతిసారి దీన్ని ఏంట్రా చూడలేక చస్తున్నాము అనే మీమ్స్ తో ఈమెను ట్రోల్ చేస్తున్నారు.ఇక ఈమె నటించిన గుంటూరు కారం సినిమా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా పట్ల కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ఈమె ఐరన్ లెగ్ ఎఫెక్ట్ మహేష్ బాబు( Mahesh Babu) గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమాపై కూడా పడుతుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయితే శ్రీ లీల ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకున్నారని ఈ సినిమా కనుక తనకు సక్సెస్ అందించకపోతే తన కెరియర్ ఇక్కడితోనే ముగిసిపోతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.