పాపం, దొంగతనానికి కొత్త అనుకుంటా.. ఎలా ఫెయిల్ అయ్యాడో చూస్తే నవ్వే నవ్వు..

సాధారణంగా దొంగతనానికి వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.అన్ని సెన్సెస్ పని చేస్తూ ఉండాలి.

 Pity, He Thinks He Is New To Theft How He Failed , Viral Video, Latest Video, Te-TeluguStop.com

ఏ చిన్న మిస్టేక్ జరిగినా దొరికిపోవడం ఖాయం, సామాన్య ప్రజల చేతుల్లో దెబ్బతినక తప్పదు.అయితే తాజాగా ఒక దొంగ గన్ తీసుకుని ఒక స్టోర్‌లో బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాక్కుందామని చూశాడు.

కానీ అతడి ప్లాన్ బెడిసి కొట్టింది.అతను తనతో పాటు తెచ్చుకున్న ఏకైక మారణాయుధం గన్( Lethal Gun ) పొరపాటున స్టోర్ సిబ్బంది ముందు పడింది.

అంతే సదరు దొంగ ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీసాడు.ఈ దొంగకు సంబంధించిన దృశ్యాలు స్టోర్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఆ వీడియోను @సీసీటీవీ ఇడియట్స్ తాజాగా షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 2 లక్షల 90 వేల వరకు వ్యూస్ వచ్చాయి.14 సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక లూస్ జీన్స్ ప్యాంటు ధరించిన వ్యక్తి గ్లాస్ డోర్ తీసుకొని స్టోర్‌లోకి రావడం చూడవచ్చు.

తర్వాత స్టోర్ కౌంటర్ లో ఉన్న మహిళను బెదిరించడానికి అతడు తన జేబులో దాచుకున్న గన్ను బయటికి తీశాడు.అయితే ఆ గన్ చేయి జారి ఆమె ముందు పడిపోయింది.

దాన్ని తీసుకుందామని ట్రై చేశాడు కానీ కౌంటర్ పైనుంచి దూకలేకపోయాడు.దాంతో అక్కడి నుంచి చాలా వేగంగా పరుగులు తీశాడు.

అయితే తన కాళ్ల దగ్గర పడిన పిస్తోలను షాప్ స్టోర్ మహిళ ( shop store woman )చాలా ప్రమాదకరంగా పికప్‌ చేసుకుంది.ట్రిగ్గర్ మీద చేయి పడితే అది ఆమె కాళ్ళలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.మరికొందరు ఆ మహిళ అలా తుపాకీ పట్టుకోవడం చాలా డేంజర్ అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ దొంగకు ఈ పని కొత్త అనుకుంటా అని మరి కొందరు సానుభూతి చూపిస్తున్నారు.దొంగతనానికి వచ్చి ఏమీ చోరీ చేయలేకపోగా తుపాకీ పోగొట్టుకున్న ఈ దొంగను చూసి మరి కొంతమంది చాలు పడుతున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube