కొంతమంది ఇతరుల బలహీనతలను సద్వినియోగం చేసుకుంటూ వారిని తేరగా వాడేస్తుంటారు.ఇక ఆకతాయిల విషయానికి వస్తే ఏదో ఒక పిచ్చి పని చేయకుండా వారు అసలు ఉండలేరు.
అదే తప్పు చేసి తప్పించుకోగలమన్న ధీమా ఉంటే చాలు ఎంతకైనా తెగిస్తారు.పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇతరులను హింసిస్తుంటారు కూడా.
ఇటీవల కూడా ఒక పోరికి ఓ ట్రైన్ ప్యాసింజర్ బలహీనతను అదునుగా చేసుకొని అతడినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.అయితే అతని టైం బాగోలేనట్టుంది, ఎందుకంటే సదరు బాధిత పాసింజర్ ట్రైన్ దిగగలిగాడు, అనంతరం ఆకతాయికి దేహశుద్ధి చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ ( Twitter)పేజీ షేర్ చేసింది.
ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఒక ట్రైన్ కనిపిస్తుంది.అదే సమయంలో ఒక బోగీ డోర్ క్లోజ్ అవుతూ ఉండటం మనం చూడొచ్చు.ఈ ట్రైన్ దిగి ఆ బోగీ డోర్ ముందున్న ఒక ప్రయాణికుడు, బోగీ లోపల ఉన్న మరొక ప్రయాణికుడిపై ఉమ్మి వేయడం కూడా మనం గమనించవచ్చు.
దాంతో బాగా కోపానికి గురైన ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు.అదే సమయంలో మళ్ళీ సదరు ఆగతాయి ఆ వ్యక్తిపై ఉమ్మి వేశాడు.దాంతో మరింత కోపానికి గురైన బాధిత ప్యాసింజర్ డోరు బలంగా పక్కకి తోయడంతో అది ఓపెన్ అయింది.
అంతే సదరు ఆగతాయి పని ఖతం మయ్యింది.బాధిత ప్యాసింజర్ ఆరడుగుల కంటే ఎత్తునట్లు, లావు ఉన్నట్లు మనం గమనించవచ్చు.అతడు ఆకతాయి మీద పడి పిచ్చి కొట్టుడు కొట్టాడు.
కిందపడేసి పంచుల వర్షం కురిపించాడు. స్టేషన్‌లో కూర్చున్న మిగతా ప్యాసింజర్లు ఈ దృశ్యాలను వీడియో రికార్డ్ చేశారు.
వీడియో చివరిలో కొందరు బాధిత ప్యాసింజర్‌ను ఆపడానికి వస్తున్నట్లు మనం చూడవచ్చు అయితే వీడియో తీస్తున్న వారు తప్పు అతనిది కాదు అని చెప్పడం కూడా మనం వినవచ్చు.పోకిరి దూల తీర్చి మంచి పని చేశావ్ భయ్యా అని ప్యాసింజర్ ( Passenger )ను ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు పొగుడుతున్నారు.
దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.