టాలీవుడ్ లో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) పేరు లేకుండా ఉండదు.నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఆయన ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకొని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా నిలిచి, మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 స్థానం పై కన్నేశాడు.
ఆ తర్వాత వరుసగా ఆయనకీ ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.ఆ ఫ్లాప్స్ నుండి తన తప్పులను తెలుసుకొని టెంపర్ చిత్రం నుండి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి సరికొత్త ఎన్టీఆర్ ని చూపిస్తున్నాడు.
ఆయన దురాభిమానుల ఎన్టీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్క అట్టర్ ఫ్లాప్ సినిమా వస్తే బాగుండును అని కోరుకుంటున్నారు, కానీ ఎన్టీఆర్ ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వడం లేదు.ఇక్కడ ఎన్టీఆర్ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో తమిళం లో తలపతి విజయ్ కూడా అదే ఫామ్ లో ఉన్నాడు.

గత దశాబ్ద కాలం నుండి ఆయన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు.మాస్ లో ఎన్టీఆర్ లాగానే విజయ్( Vijay ) కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.ప్రస్తుతం ఇండియా లో మల్టీస్టార్రర్ ట్రెండ్ వేరే లెవెల్ లో నడుస్తున్న ఈ నేపథ్యం లో ఎన్టీఆర్ మరియు విజయ్ కలిసి ఎందుకు ఒక సినిమా చెయ్యకూడదు?, అనే ఆలోచన అభిమానుల్లో ఉన్నది.అయితే ఈ ఆలోచన కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, డైరెక్టర్స్ లో కూడా ఉంది.
ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ విజయ్ తో ఇప్పటి వారికి తుపాకీ( Thuppaki ),కత్తి మరియు సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీసాడు.ఆయన వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ తియ్యాలని ఆలోచనలో చాలా రోజుల నుండి ఉంది.
ఈ సినిమా ని రెండు భాషల్లో సెపెరేట్ గా తీస్తారు అట.తమిళ భాషలో విజయ్ హీరో, ఎన్టీఆర్ విలన్.

అలాగే తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ హీరో, విజయ్ విలన్.ఇలా రోల్స్ రివర్స్ చేసి తియ్యాలని అనుకున్నాడట.గతం లో విక్రమ్ ‘రావణ్( Raavan )’ చిత్రాన్ని ఇలాగే తీసాడు డైరెక్టర్ మణిరత్నం.ఆ సినిమా సక్సెస్ అయ్యింది, మళ్ళీ అదే ఫార్ములాతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తియ్యాలని అనుకున్నాడట డైరెక్టర్ మురగదాస్.
కానీ ఎందుకో ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ స్క్రిప్ట్ ని చెయ్యడానికి సుముఖత చూపలేదు.ఎందుకంటే అప్పట్లో ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం ఉండేది.
కానీ #RRR తర్వాత ఆ భయాలు పోయాయి, కాబట్టి భవిష్యత్తులో ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.