మనిషి జీవితంలో పెళ్లి అతి మధురమైన ఘట్టం.దీంతో పేదవాళ్లు మొదలుకొని ఐశ్వర్యవంతులు వరకు.
డబ్బులు ఉన్నా లేకపోయినా.పెళ్లి( Marriage ) చాలా ఘనంగా ఉన్నంతలో జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా రకరకాల జాతులు, మతాలు ఉన్నాగాని వివాహం అనేది చాలా ఘనంగా చేసుకుంటారు.మానవ జీవితంలో పెళ్లి చాలా ప్రాముఖ్యమైన ఘట్టం.
ఆ పెళ్లిలో ఒకట్టి అయ్యే జంటలు ఎన్నో కలలతో నూతన జీవితాలను ప్రారంభించాలని అనుకుంటాయి.ఇదే సమయంలో పెద్దలు, బంధువులు.
నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.తుది శ్వాస వరకు కలిసుండాలని కోరుకుంటారు.
ఇదిలా ఉంటే ఛత్తీస్ గఢ్( Chhattisgarh ) రాష్ట్రంలో పెళ్లయిన కొన్ని క్షణాలకే నూతన వధూవరులు మరణించడం జరిగింది.భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతకాలని పెళ్లయిన జంట.కొద్ది క్షణాలలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడవటం జరిగింది.ఈ విషాదకర ఘటన ఛత్తీస్ గఢ్ లో జాంజ్ గిర్- చంపా జిల్లాలో జరిగింది.
వివాహం జరిగిన తర్వాత నూతన వధూవరులు మరియు బంధువులు ఒకే వాహనంలో వెళ్తుండగా ఓ ట్రక్కు ఢీకొనడం జరిగింది.దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో వధువు మరణించగా వరుడు మరో ముగ్గురు బంధువులు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.