సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) సినిమాలు అంటేనే వాయిలెన్స్ మరియు బోల్డ్ కంటెంట్ అనే క్లారిటీ అందరికీ ఉంది.అప్పట్లో అర్జున్ రెడ్డి ఆ తర్వాత కబీర్ సింగ్ ఇప్పుడు అనిమల్ సినిమా( Animal movie ) ఈ మూడు సినిమాలను ఒకే గాటికి కట్టేసినట్టుగా ఉంటాయి.
ఎందుకంటే ఈ మూడింటిలోనూ ఉన్నవి కేవలం వాయిలెన్స్ మరియు బోల్డ్ కంటెంట్ మాత్రమే.అందుకే సందీప్ రెడ్డి అంటే చాలు వాయిలేన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.
అయితే చాలామంది అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత అలాంటి సినిమాలే చేయడానికి ముందుకు వచ్చారు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఒక జనరేషన్ కి ఆదర్శంగా నిలిచింది.అర్జున్ రెడ్డి తరహాలోనే బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఇండస్ట్రీలో జనరేట్ అయింది.

థియేటర్లోనే కాదు ఓటీటి ప్లాట్ఫామ్( OTT platform ) లో కూడా ఇది ఎక్కువ మోతాదులో కనిపించింది.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా సందీప్ రెడ్డివంగా తీసిన సినిమాలను చూసి చాలామంది ఫాలో అవుతున్నారు అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తున్నారు.ఒకసారి అర్జున్ రెడ్డి వచ్చాక అది ట్రెండ్ గా కొనసాగింది.సినిమా ఇండస్ట్రీ అర్జున్ రెడ్డికి ( Arjun Reddy )ముందు ఆ తర్వాత అన్న విధంగా మారిపోయింది కానీ ఎంతమంది సక్సెస్ అయ్యారు అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆదిశగా ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టారు.
అందుకే బోల్డ్ కంటెంట్ కి వల్గారిటికి తేడా తెలుసుకుని తీయడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం.

ఇప్పుడు అనిమల్ సినిమా విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అందరూ అదే ఊపు లో ఒక రకమైన బోళ్ళు కంటెంట్ సినిమాలను డెవలప్ చేసే పనిలో ఉన్నారు అయితే సందీప్ రెడ్డికి వంగా కి ఉన్న క్లారిటీ అందరికీ ఉండే అవకాశం లేదు.అందుకే మళ్ళీ అలాంటి సినిమాలు తీసి పప్పులో కాలేసే ప్రయత్నం చేయొద్దు అని ఒక వర్గం ప్రేక్షకులు కోరుకుంటున్నారు.మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఉన్న జాడ్యం కూడా ఇది ఏదైనా సినిమా హిట్ అయింది అంటే అందరూ అదే తరహా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.