ఎట్టకేలకు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ( Rahul gandhi) ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అందరూ తరలివచ్చారు.
అయితే రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తో పాటు మంత్రులు కూడా ఇందులో ప్రమాణ స్వీకారం చేశారు.ఇందులో సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మల్లు భట్టి విక్రమార్క,దామోదర్ రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ఇప్పటివరకు కేబినెట్లో కొలువుదీరిన మంత్రుల్లో కేవలం ఖమ్మం జిల్లా నుండే ముగ్గురు మంత్రులు ఉన్నారు.

అందులో తుమ్మల నాగేశ్వరరావు( Thummala nageshwar rao ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క.ఇక ఉప ముఖ్యమంత్రిగా కూడా ఖమ్మం జిల్లా నుండి మల్లు భట్టి విక్రమార్క కే ఇచ్చారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇన్ని నియోజకవర్గాల్లో కేబినెట్లో ఎక్కువ ప్రాధాన్యం కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులకు మాత్రమే ఇచ్చారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నల్గొండ, ఖమ్మం జిల్లాలే ప్రధాన పాత్ర పోషించాయి.

ఈ రెండు నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వచ్చాయి.అంతేకాకుండా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో కాంగ్రెస్( Congress ) కు ఈ అంశం కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు.అంతేకాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్న నాయకులు బీఆర్ఎస్ ని ఇక్కడ పూర్తిగా లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రచారంలో మునిగితేలారు.
అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఖమ్మం, నల్గొండలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కే ఉన్నాయి.ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలకే కాంగ్రెస్ పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు.
ఇక ఖమ్మం ( Khammam ) నుండి ముగ్గురు మంత్రులకు కేబినెట్లో చోటు దక్కింది.అలాగే నల్గొండ నుండి కూడా రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )కి మంత్రి పదవి వస్తుందని తెలుస్తోంది.