అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి( Vivek Ramaswamy ) వరుస షాకులు తగులుతున్నాయి.గత వారం రామస్వామి జాతీయ ఎన్నికల ప్రచార కమిటీ డైరెక్టర్ బ్రాయన్ స్వెన్షన్( Brian Swensen ) రాజీనామా చేసి ట్రంప్ ప్రచార బృందంలో చేరిపోయారు.
తర్వాత రామస్వామి ప్రచార బృందంలో వీడియో గ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న బ్రాండన్ గుడ్ ఇయర్( Brandon Goodyear ) కూడా ఆయనకు షాకిచ్చారు.వీరిద్దరిలో బ్రాయన్ స్వెన్షన్ నిష్క్రమణ .వివేక్‌కు గట్టి ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటి వరకు తమకు అందించిన సేవలకు , సహాయ సహాకారాలకు బ్రాయన్‌కు ధన్యవాదాలు తెలిపారు రామస్వామి అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్.
ఆయన జీవితంలో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.న్యూ హాంప్‌షైర్‌లో రామస్వామి రాజకీయ కార్యకలాపాలను ఇప్పటి వరకు బ్రాయన్ పర్యవేక్షిస్తూ వుండగా.ఇకపై సీనియర్ సలహాదారు మైక్ బియుండో( Mike Biundo ) చూసుకుంటారని మెక్‌లాఫ్లిన్( Tricia McLaughlin ) చెప్పారు.
జనవరిలో కీలకమైన అయోవా, న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ సీజన్ ప్రారంభానికి ముందు స్వెన్షన్ నిష్క్రమణ జరగడంతో వివేక్ ఎలా ముందుకు వెళ్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
దీనికి తోడు ఎర్లీ స్టేట్ పోల్స్‌లో రామస్వామి కంటే ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, ( Ron DeSantis ) మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతో సహా మిగిలిన రిపబ్లికన్ పోటీదారుల కంటే వివేక్ వెనుకబడి వున్నారు.
2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీలో ముందున్న ట్రంప్‌తో( Donald Trump ) సన్నిహితంగా వున్నప్పటికీ రామస్వామి ప్రచారం వెనుకబడిందనే చెప్పొచ్చు.రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో మిగిలిన అభ్యర్ధులు సైతం రామస్వామిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు.రాజకీయాల్లో అనుభవ లేమి, అమెరికా విదేశాంగ విధానంపై రామస్వామి వివాదాస్పద వైఖరిపై మండిపడుతున్నారు.
వివేక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఆ వెంటనే తన వాగ్ధాటి, ప్రచార హోరుతో ఒకదశలో ట్రంప్, డిసాంటిస్‌ల సరసన చేరారు.
కానీ ఆ ఊపును నిలబెట్టుకునే క్రమంలో వివేక్ రామస్వామి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ముక్కుసూటిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొన్నిసార్లు దుమారం రేపాయి.అయినప్పటికీ రామస్వామికి మద్ధతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతున్నారు.తాజాగా కొద్దిరోజుల క్రితం తాను హిందువునని .తాను కర్మను, అదృష్టాన్ని నమ్ముతానని రామస్వామి చెప్పారు.గత నెలలో డైలీ సిగ్నల్ ఫ్లాట్‌ఫాం నిర్వహించిన ‘‘ ది ఫ్యామిలీ లీడర్’’ ఫోరమ్‌లో ఆయన పాల్గొన్నారు.
హిందూ – క్రైస్తవ మత బోధనల మధ్య సమాంతరాలను వివేక్ వివరించారు.
తాను క్రిస్టియన్ హైస్కూల్‌లో చదువుకున్నానని.
బైబిల్ చదువుతానని , నిజమైన దేవుడు ఒక్కడేనని వివేక్ వివరించారు.తల్లిదండ్రులను గౌరవించండి, అబద్ధం చెప్పకు, దొంగతనం, వ్యభిచారం చేయొద్దనే విషయాలను తాను అక్కడ నేర్చుకున్నానని ఆయన గుర్తుచేశారు.
ఈ విలువులు హిందువులకో, క్రైస్తవులకో చెందినవి కావు .అవి నిజానికి దేవునివని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.