సాధారణంగా అమ్మాయిల్లో చాలా మందికి హెయిర్ ను పొడుగ్గా పెంచుకోవాలనే కోరిక ఉంటుంది.కానీ కాలుష్యం, పోషకాలు కొరత, ఒత్తిడి తదితర కారణాల వల్ల జుట్టు సరిగ్గా పెరగదు.
దీంతో ఎంత ప్రయత్నించినా కూడా లాంగ్ హెయిర్ ను సొంతం చేసుకోలేకపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.తల స్నానం( Head bath ) సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాను పాటిస్తే చాలా వేగంగా మరియు సులభంగా లాంగ్ హెయిర్ ను పొందవచ్చు.
మరి ఇంతకీ ఆ చిన్న చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండున్నర గ్లాసుల వాటర్ ను పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) , రెండు స్పూన్లు డ్రై ఆమ్లా ముక్కలు( Dry amla pieces ) వేసి ఉడికించాలి.
దాదాపు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను కలపాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ గ్రోత్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
మీ జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా సరే తలస్నానం సమయంలో ఈ చిట్కాను పాటిస్తే కొద్దిరోజుల్లోనే కురులు పొడుగ్గా మారతాయి.మరియు పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకోవడం వల్ల డ్రై హెయిర్ సమస్య ఉండదు.కురులు స్మూత్ గా మారతాయి.
జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.హెల్తీగా, స్ట్రాంగ్ గా సైతం మారుతుంది.
కాబట్టి లాంగ్ హెయిర్ కోసం ఆరాటపడేవారు తప్పకుండా ఈ ఇంటి చిట్కాను పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.