చాలా మంది అమ్మాయిలు తమ జుట్టు సాఫ్ట్ అండ్ షైనీ గా( Soft And Shiny Hair ) మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.ఇందులో భాగంగా సెలూన్ కు వెళ్లి తరచూ హెయిర్ స్పా( Hair Spa ) చేయించుకుంటూ ఉంటారు.
ఇందుకోసం ప్రతి నెలా వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( Curd ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloevera Gel ) ఒక ఎగ్ వైట్( Egg White ) వేసుకోవాలి.
అలాగే చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే ఎన్నో హెయిర్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ రెమెడీ మీ జుట్టును సాఫ్ట్ అండ్ షైనీ గా మారుస్తుంది.పెరుగు, అలోవెరా జెల్, గుడ్డు మరియు ఆవ నూనెలో ఉండే పోషకాలు కురులను ఆరోగ్యంగా మారుస్తాయి.
సాఫ్ట్ గా తయారు చేస్తాయి.షైనీగా మెరిపిస్తాయి.

అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి సాఫ్ట్, షైనీ అండ్ హెల్తీ హెయిర్ ను కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.