యువకుడి మరణానికి కారణమైన వీధికుక్క.. మృతుడి తల్లి వద్దకు వచ్చి ఏడ్చింది..!

కర్నాటకలో ఒక వీధి కుక్క( Stray Dog ) యువకుడి ప్రాణాలను బలిగొన్నది.ఈ విషాద ప్రమాదం కుటుంబ సభ్యుల్లో ఎంతో బాధను నింపింది.

 Dog Remorseful As Biker Dies Trying To Dodge It Visits Deceased Mother Details,-TeluguStop.com

ఈ యువకుడు ఆ కుక్కను తన బైక్( Bike ) ఢీ కొడితే చనిపోతుందని భావించి దానిని పక్కకు తిప్పాడు.ఆ సమయంలో కంట్రోల్ తప్పి కింద పడిపోయి తాను చనిపోయాడు.

అయితే ఈ వీధి కుక్క తన వల్లే అతడు చనిపోయాడని గ్రహించగలిగింది.అంతేకాదు అతడి కుటుంబం వద్దకు వచ్చేందుకు చాలా ప్రయత్నించింది మృతుడి తల్లి వద్దకు వెళ్లి తన చేతిలో తన తలపెట్టి బాధగా ఫేస్ పెట్టింది.

దాంతో చెలించిపోయిన ఆ కుటుంబ సభ్యులు దానిని దత్తత తీసుకున్నారు.ఇప్పుడు ఈ స్టోరీ చాలా మంది హార్ట్స్ టచ్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, నవంబర్ 16న దావణగెరె జిల్లాలో తిప్పేష్ (21)( Tippesh ) బైక్ పై వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా వీధి కుక్క వచ్చింది.దానిని ఢీకొట్టకుండా పక్కకు తప్పుకున్నాడు.

వాహనంపై అదుపు తప్పి తలకు బలమైన గాయమైంది.శివమొగ్గ జిల్లాలోని భద్రావతి పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయినా కుక్క ఆ యువకుడిని వదలలేదు.ప్రమాద స్థలానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేష్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకెళ్లిన అంబులెన్స్‌ను అది అనుసరించింది.

అది అంత్యక్రియలకు హాజరై ఇంటి దగ్గరే ఉండిపోయింది.కొన్ని రోజుల తర్వాత అది ఇంట్లోకి ప్రవేశించి తిప్పేష్ తల్లి యశోదమ్మ( Yashodamma ) వద్దకు చేరుకుంది.జరిగినదానికి తన దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమె చేతిపై తల నిమురింది.

Telugu Animals Bond, Biker, Mother, Dog Remorseful, Grief, Karnataka, Stray Dog,

యశోదమ్మకు కుక్కతో సంబంధం ఉందని భావించి దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.ఆమె మాట్లాడుతూ, “అంత్యక్రియల తర్వాత కుక్క మా ఇంటికి రావడానికి ప్రయత్నించింది, కానీ మా ప్రాంతంలోని ఇతర కుక్కలు దాన్ని తరిమికొట్టాయి.చివరకు కొన్ని రోజుల తర్వాత లోపలికి ప్రవేశించి, నా చేతిపై తల వంచింది.

కుక్క తిప్పేష్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మాకు అనిపించింది.అది ఇప్పుడు మాతో జీవిస్తోంది.” అని అన్నారు.

Telugu Animals Bond, Biker, Mother, Dog Remorseful, Grief, Karnataka, Stray Dog,

కుక్కపై తమకు కోపం లేదని, అది ఒక ప్రమాదమేనని అర్థమైందని తిప్పేష్ సోదరి చందన తెలిపింది.ఆమె, “దురదృష్టవశాత్తు మా సోదరుడిని కోల్పోయాము, కానీ మేం కొత్త ఫ్యామిలీ మెంబర్‌ను పొందాం.కుక్క చాలా ఫ్రెండ్లీగా ఉంది.దానికి మా అమ్మతో ప్రత్యేక బంధం ఉన్నట్లు అనిపిస్తుంది.” అని చెప్పింది.

తిప్పేష్, కుక్క కథ చాలా మంది హృదయాలను హత్తుకుంది.దీని గురించి అనేక మీడియా సంస్థలు నివేదించాయి.కొందరు వ్యక్తులు కుక్క పట్ల ప్రేమను చూపించిన కుటుంబాన్ని ప్రశంసించారు, మరికొందరు వారి మృతికి తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube