బాలకృష్ణ మెమెరీ పవర్ చూసి షాక్ అయ్యిన 'యానిమల్' టీమ్!

నందమూరి బాలకృష్ణ ( Balakrishna )వరుస సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.అన్ స్టాపబుల్ షోతో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.

 Sandeep Reddy Vanga Interesting Comments On Balakrishna, Balakrishna, Unstoppabl-TeluguStop.com

ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.

ఆహా వారు పార్ట్ 2 కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేసారు చేసి ఈ మధ్యనే ముగించారు.ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు.

రెండు సీజన్స్ గ్రాండ్ గా ముగించడంతో బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అనిపించుకున్నారు.ఇదిలా ఉండగా ఇటీవలే మూడవ సీజన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు మేకర్స్.

Telugu Animal, Balakrishna, Bollywood, Ranbir Kapoor, Sandeepreddy, Tollywood-Mo

లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సీజన్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నలు యానిమల్ ( Animal Movie) మూవీ టీమ్ రానున్నారు.ఇప్పటికే టీమ్ తో షూట్ పూర్తి అవ్వగా బాలయ్య ఈ మోస్ట్ ఏవైటెడ్ వైల్డ్ ఎపిసోడ్ ను పూర్తి చేసారు.కాగా ఈ ఎపిసోడ్ కు వచ్చిన డైరెక్టర్ సందీప్ వంగ బాలయ్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Animal, Balakrishna, Bollywood, Ranbir Kapoor, Sandeepreddy, Tollywood-Mo

ఈ షో చూసి షాక్ అయ్యానని బాలయ్య గారి పై ఉన్న అభిప్రాయాన్ని చాలా మార్చింది ఈ షో అని తెలిపాడు.అలాగే తాజాగా ఎపిసోడ్ లో రణబీర్ తాత గారు చెప్పిన డైలాగ్ ను బాలయ్య అలవోకగా చెప్పారట.ఈ డైలాగ్ బాలయ్య నోటా విని సందీప్ మాత్రమే కాదు రణబీర్ కూడా షాక్ అయ్యారట.

ఎందుకంటే అంత పెద్ద డైలాగ్ తనకే గుర్తు లేదని అలాంటి డైలాగ్ ను బాలయ్య చెయ్యడం చూసి మతి పోయిందట.ఈయన మెమొరీ పవర్ కు నేను ఫ్యాన్ అయిపోయాను అంటూ సందీప్ వంగ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరి యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube