భారతదేశంలో మోటర్ సైకిళ్ల( Motorcycles ) కొనుగోలు భారీగా పెరిగాయి.భారతదేశంలో ఉండే రోడ్లు ఎక్కువగా మోటార్ల సైకిళ్ల వల్ల ఎప్పుడు రద్దీగా ఉంటాయి.
అయితే మోటర్ సైకిల్ మెయింటెనెన్స్ పై అవగాహన లేకపోవడం వల్ల మోటార్ సైకిల్ లైఫ్, పెర్ఫార్మెన్స్ తగ్గుతోంది.మరొక పక్కా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా వెహికల్స్ పనితీరుపై ప్రభావం చూపుతాయి.
మోటార్ సైకిళ్ల లైఫ్, పర్ఫామెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే కొన్ని సూపర్ టిప్స్ పాటించాలి.ఈ టిప్స్ తో మోటార్ సైకిళ్ల ఫిట్నెస్ సరిగా ఉంటుంది.
అంతేకాకుండా బెస్ట్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.
మోటార్ సైకిల్ నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా ఇంజిన్ ఆయిల్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.పాత ఇంజిన్ ఆయిల్( Engine oil ) ను పూర్తిగా తీసివేసి క్వాలిటీ ఇంజన్ ఆయిల్ ఫిల్ చేయాలి.అప్పుడప్పుడు ఆయిల్ ఫిల్టర్ ను కూడా మారుస్తూ ఉండాలి.
ఇలా చేస్తే సేఫ్ రైటింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.
మోటార్ సైకిల్లో అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది చైన్ సెట్.మోటార్ సైకిల్ లో ఉండే చైన్ సెట్ లో ఎప్పుడు దుమ్ము, ధూళి వచ్చి చేరుతుంది.అప్పుడప్పుడు ఈ చైన్ సెట్ కు సరిగ్గా గ్రీజు కొట్టాలి.
బైక్ సరిగా రన్ అయ్యేలా చైన్ లూబ్రికెంట్ గా ఉండాలి.చీప్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు.
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వెహికల్ పనితీరులో మార్పు వస్తుంది.మోటార్ సైకిల్ ముందు భాగం టైర్లు గాలి 18-20 PSI, వెనుక టైర్లో 24-26PSI ప్రెజర్ ఉండాలి.
ఇలా ఉంటే బైక్ మైలేజీ ( Bike mileage )సూపర్ గా ఉంటుంది.మోటార్ సైకిల్ లో బ్యాటరీ హెల్త్, ఓల్టేజ్, వాటర్ లెవెల్ సరిగ్గా ఉన్నాయో లేవో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
ఒకవేళ కొత్త బ్యాటరీ అమర్చాలనుకుంటే టెర్మినల్స్ ను శుభ్రం చేసిన తర్వాతనే అమర్చాలి.