టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్( Payal Rajput ) తాజాగా నటించిన చిత్రం మంగళవారం.( Mangalavaaram ) తాజాగా భారీ అంచనాల నడుమ నవంబర్ 17న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు అజయ్ భూపతి( Ajay Bhupathi ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది పాయల్ రాజ్ పుత్.
ఇక అందులో భాగంగానే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంటర్వ్యూలో భాగంగా మీరు రోజ్ ఇవ్వాలనుకుంటే ఇండస్ట్రీలో ఉన్న వారిలో ఎవరికి ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.పాయల్ రాజ్‌పుత్ సిగ్గుపడుతూ నేను రోజా పువ్వు ఇచ్చే ఒకే ఒక పర్సన్ ప్రభాస్( Prabhas ) మాత్రమే.
ఒకవేళ తను నా ముందుకు వస్తే కచ్చితంగా ఇస్తాను అని తెలిపింది పాయల్ రాజ్‌పుత్. రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యు ప్రభాస్ అని చెబుతారా అని అనగా పాయల్ సిగ్గుపడుతూ ఈ ఇంటర్వ్యూలో నా సినిమా కంటే ఎక్కువగా ప్రభాస్ గురించే చర్చించినట్లు ఉన్నాను అని నవ్వుతూ తెలిపింది.
అలాగే నాకు ఆదివారాలు అంటే చాలా ఇష్టం.అలాగే సండే తన కోసం రిజర్వ్ చేసి ఉంచాను.తనకు ఏది కావాలి అంటే అది నా చేతితో స్వయంగా వంట చేసి పెడతాను.నాకు రాజ్‌మా రైస్ అంటే చాలా ఇష్టం.కాబట్టి అదే చేసి ప్రభాస్‌కి పెట్టాలనుకుంటున్నాను.నా చేతితో స్వయంగా తినిపిస్తాను అని చెప్పుకొచ్చింది పాయల్ రాజ్‌పుత్.
కాగా ప్రస్తుతం పాయల్ చేసిన వాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.కాగా పాయల్ వాఖ్యలపై ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.