రూ.8 వేల పెన్సిల్.. ఈ నెక్స్ట్ జనరేషన్ పెన్సిల్ ప్రత్యేకతలు ఇవే

యాపిల్( Apple Products ) నుంచి ఎలాంటి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చినా దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.తాజాగా యాపిల్ కంపెనీ నుంచి నెక్స్ట్ జనరేషన్ పెన్సిల్ విడుదల అయింది.యాపిల్ పెన్సిల్ 3( Apple Pencil 3 ) పేరుతో మార్కెట్‌లో విడుదలైన దీని ధర రూ.7,900లుగా కంపెనీ నిర్ణయించింది.యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐప్యాడ్ యాక్సెసరీ యాపిల్ పెన్సిల్ 3ని ముందస్తు ఆర్డర్ చేయవచ్చు.ఆపిల్ ఇటీవలే స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో సరికొత్త ఎం3 చిప్‌సెట్‌తో తన మ్యాక్‌బుక్ ప్రో లైనప్‌ను ప్రారంభించింది.

 Apple Pencil 3 Features And Specifications,apple Products,apple Pencil,apple Pen-TeluguStop.com

ఈవెంట్‌కు కొన్ని రోజుల ముందు, కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం యూఎస్‌బీ-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే యాపిల్ పెన్సిల్‌ను కూడా ప్రకటించింది.ఆపిల్ పెన్సిల్ 3 విక్రయాన్ని నవంబర్ ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు యాపిల్ తెలిపింది.

ఈ క్రమంలో, యాపిల్ తన అధికారిక సైట్‌లో ఆపిల్ పెన్సిల్ 3ని విక్రయిస్తోంది.

యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐప్యాడ్ యాక్సెసరీ యాపిల్ పెన్సిల్ 3 ధర రూ.7,900. కస్టమర్‌లు ఇప్పుడు కంపెనీ సైట్‌లో ఆపిల్ పెన్సిల్ తాజా వెర్షన్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు.

నవంబర్ 4 నుంచి యాపిల్ పెన్సిల్ డెలివరీని ప్రారంభించనుంది.అయితే యాపిల్ స్టోర్లలో ఇది నవంబర్ 7 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

తాజా యాపిల్ పెన్సిల్ 3 యూఎస్‌బీ-సీ పోర్ట్‌( USB-C Port )ను కలిగి ఉంది.మ్యాట్ ఫినిషింగ్‌తో రూపొందించబడిన యాపిల్ పెన్సిల్ 3 ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంది.

ఐప్యాడ్‌కు దీనిని సులభంగా పెయిర్ చేసుకునే సౌలభ్యం ఉంది.

ఈ సరికొత్త పెన్సిల్‌లో ఛార్జింగ్, వైర్‌లెస్‌ పెయిరింగ్‌( Wireless Pairing ), సెన్సిటివిటీ, డబుల్ ట్యాప్‌ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి డిస్కౌంట్లను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.అయితే ఇదిలా ఉంటే ఎడ్యుకేషన్‌ ప్లాన్‌ ద్వారా దీనిని కాస్త తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.స్టూడెంట్స్, టీచర్లు ఈ కొత్త యాపిల్ పెన్సిల్ 3ను రూ.1000 డిస్కౌంట్‌తో రూ.6,999కే కొనుగోలు చేయొచ్చు.

Apple Pencil Features and Specifications

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube