టాలీవుడ్ హీరో శర్వానంద్( Hero Sharwanand ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు అని చెప్పవచ్చు.గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడు సినిమాలు చేశాడు.
కానీ ఊహించని విధంగా ఆ ఏడు సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి.దాంతో శర్వానంద్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు.
కాగా ఇటీవల శర్వానంద్ ఒక ఇంటి వాడైన విషయం మనందరికీ తెలిసిందే.గత ఏడాది ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ఇది ఇలా ఉంటే హీరో శర్వానంద్ ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్లు లేవు కానీ ఈ సినిమా వివాదంలో ఇరుక్కుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.శర్వానంద్ సామజవరగమన చిత్రంతో సక్సెస్ కొట్టిన రామ్ అబ్బరాజు( Ram Abbaraju ) దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ కథ మొదట నాగచైతన్య వద్దకు వెళ్లింది.కానీ ఆయన రిజక్ట్ చేశాడు.సినిమాలో విడాకుల పాయింట్ ఉండటంతో చైతూ నో చెప్పాడని సమాచారం.దీంతో అదే కథని శర్వానంద్‌కి చెప్పాడు రామ్ అబ్బరాజు.
ఇందులో ఉన్న కామెడీకి ఎగ్జైట్ అయిన శర్వానంద్ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) దీన్ని నిర్మించబోతున్నారు.ఈ విషయం తెలిసి సామజవరగమన నిర్మాతలు వివాదం చేస్తున్నారట.సామజవరగమన సినిమా తర్వాత రెండో చిత్రం కూడా తమ బ్యానర్‌లోనే చేయాలని దర్శకుడు రామ్ అబ్బరాజుతో అగ్రిమెంట్ చేసుకున్నారట నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్ దండా.
ఆ సినిమాని అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించిన విషయం తెలిసిందే.సామజవరగమన పెద్ద హిట్ అయ్యింది.యాభై కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి శ్రీవిష్ణు కి హిట్ ఇచ్చి గట్టేక్కించింది.దీంతో శర్వానంద్ కూడా గట్టేక్కేందుకు రామ్ అబ్బరాజుని నమ్ముకున్నారట.
అలాగే శర్వానంద్ కూడా రామ్ అబ్బరాజు సినిమాపైనే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారట.కానీ ఇప్పుడు దర్శకుడు రామ్ అబ్బరాజు తమ అగ్రిమెంట్‌ని బ్రేక్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా చేయడం పట్ల నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్ దండా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.
ఈ విషయంపై ఇంకా మరింత క్లారిటీ రావాల్సి ఉంది.