టాపర్ గా నిలిచి రోజంతా ఏడ్చా.. తల్లయ్యాక 15 బంగారు పతకాలు.. ఈ యువతి సక్సెస్ స్టోరీ తెలుసా!

ఏ రంగంలోనైనా ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించడం సులువు కాదు.లక్షల వేతనంతో జాబ్ చేస్తున్నా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఏదైనా బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెడితే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Srividya Career Success Story Details Here Goes Viral In Social Media , Mysuru-TeluguStop.com

ఒక పక్క నాన్న మరణం.మరోపక్క ఫైనల్ పరీక్షలు.

ఇలాంటి కష్టాలను సైతం అనుభవించి శ్రీవిద్య కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.ఒకవైపు ఆర్థిక కష్టాలను అనుభవిస్తూనే మరోవైపు శ్రీవిద్య చెల్లెలి బాధ్యతలను తీసుకున్నారు.

శ్రీవిద్య ఇప్పటివరకు ఏకంగా 15 బంగారు పతకాలను గెలుచుకున్నారు.మైసూరు జిల్లా( Mysuru )లోని కల్కుణికె గ్రామానికి చెందిన శ్రీవిద్య పేద కుటుంబంలో జన్మించారు.

శ్రీవిద్య తండ్రి స్వామి వాయిదా పద్ధతిలో వంట సామాన్లను అమ్మే వ్యాపారం చేసేవారు.ఇంటి దగ్గర సైకిల్ షాపును ఆయన నిర్వహించేవారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల పది వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన శ్రీవిద్య పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో నెలకు 1000 రూపాయల చొప్పున స్కాలర్ షిప్ పొందారు.శ్రీవిద్య( Srividya ) ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే సమయంలో తండ్రి మరణించారు.బాధ పడుతూనే పరీక్షలు రాసి శ్రీవిద్య కాలేజ్ టాపర్ గా నిలవడం గమనార్హం.ఆ తర్వాత రోజుల్లో ప్రదీప్ అనే టీచర్ ను శ్రీవిద్య పెళ్లి చేసుకున్నారు.

భర్త ప్రోత్సాహంతో ఎం.ఏ కల దిశగా శ్రీవిద్య అడుగులు వేశారు.మైసూరు యూనివర్సిటీ( Mysuru University ) స్నాతకోత్సవంలో శ్రీవిద్య 15 బంగారు పతకాలతో పాటు నాలుగు నగదు పురస్కారాలను అందుకున్నారు.టీచర్ గా ఎంపికైన శ్రీవిద్య పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

పెళ్లి చదువుకు అడ్డు కాదని ఆమె చెబుతున్నారు.శ్రీవిద్య కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

నెటిజన్లు సైతం శ్రీవిద్యను ఎంతగానో ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.

Srividya Career Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube