తెలుగు ప్రేక్షకులకు హీరో అశోక్ గల్లా( Ashok Galla ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అశోక్ గల్లా సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అశోక్ గల్లా హీరో సినిమాతో హీరోగా తెలుగు సినీమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇకపోతే అశోక్ గల్లా తన రెండవ సినిమాని అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు.
అశోక్ గల్లా 2 పేరుతో సంబోధిస్తున్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashant Verma ) కథను అందించారు.లలితాంబికా ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఎన్నారై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సోమినేని బాలకృష్ణ ( Somineni Balakrishna )ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కే సాగర్ సహ నిర్మాతగా నల్లపనేని యామిని( Nallapaneni Yamini ) సమర్పిస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.ఆది పురుష్ మూవీతప్పు పాన్ ఇండియా లెవెల్ లో మెరిసిన దేవదత్త నాగే( Devadatta Nage ) ఈ సినిమాలో కంసరాజు అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందులో కత్తి పట్టుకుని చాలా వయలెంట్ గా కనిపించారు.ఇక ఆదిపురుష్ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి( Manasa Varanasi ) హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.ధమాకా, బలగం లాంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేసి టీజర్ ను రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు మూవీ మేకర్స్.