వ్యవసాయ రంగంలో( Agriculture ) రసాయన ఎరువుల వాడకం విస్తృతంగా పెరిగింది.ఈ మధ్యకాలంలో రైతులు ప్రతి చిన్న విషయానికి రసాయన మందులపై ఆధారపడుతున్నారు.
అయితే అప్పటికి మాత్రం దిగుబడి బాగానే ఉన్న నేల క్రమేణా కలుషితం అవుతూ చివరికి వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది.కాబట్టి అత్యవసర పరిస్థితులలో మాత్రమే రసాయన పిచికారి( Chemical Fertilizers ) మందులను ఉపయోగించాలి.
మిగతా పరిస్థితులలో సేంద్రియ పద్ధతులే బెస్ట్ అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.గతంలో అధికంగా పశువుల ఎరువు, పశువుల మూత్రం, వేప నూనె లాంటి సహజ సిద్ధమైన ఎరువులు ఉపయోగించేవారు.
కానీ ప్రస్తుతం ప్రతిదానికి రసాయన మందులపై ఆధార పడడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే వరి పొలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాల లోపాలు, రసం పీల్చే పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల ద్రావణం( Aak Madar Plant ) బాగా పనిచేస్తుందని కొందరు రైతులు నిరూపించారు.సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించుకుంటే పెట్టుబడి భారం తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుంది.జిల్లేడు ఆకుల రసాన్ని ఏ విధంగా తయారు చేసుకొని,ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.ముందుగా 20 కేజీల జిల్లేడు ఆకులు, 10 లీటర్ల ఆవు మూత్రం, 200 లీటర్ల నీరు సేకరించాలి.
ఈ మూడింటిని ఒక డ్రమ్ లో వేసి కలుపుకోవాలి.మూడు రోజులపాటు ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఒక కర్ర సహాయంతో కలపాలి.మూడు రోజుల తర్వాత ఈ మిశ్రమం వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.100 లీటర్ల నీటిలో( Water ) పది లీటర్ల జిల్లేడు ఆకుల రసం కలిపి పంటకు పిచికారి చేయాలి.ఈ తయారుచేసిన జిల్లేడు ఆకుల రసం కేవలం 7 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది.
కాబట్టి అవసరం అయినంత మేర తయారు చేసుకుని పంటకు పిచికారి చేయాలి.ఇలా వ్యవసాయంలో సేంద్రియ పద్ధతులను ఉపయోగించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.