రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి: జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్ ఖీమ్యా నాయక్

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని తూచ తప్పకుండా పాటించాలని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్‌ ఎన్ ఖీమ్యా నాయక్( Additional Collector Kheemya Naik ) అన్నారు.మంగళవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిదులతో సమీక్ష నిర్వహించారు.

 Political Parties Must Strictly Follow Election Rules: District Additional Colle-TeluguStop.com

ఎన్నికలలో ఉపయోగించే వస్తువులకు సంబంధించి రేట్ చార్ట్ ను , ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా రేట్ కార్డ్ ను ప్రతినిధులకు చదివి వినిపించారు.వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీ లనాయకులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు.జిల్లాలో ఎన్నికల నియామవళి, ఎన్‌ఫోర్స్‌ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్నారు.

కుల మత, ప్రాంత , వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం నిర్వహించరాదని, ఓటర్లను మద్యం, నగదు, కానుకల పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేయవద్దని సూచించారు.పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలన్నారు.

ప్రచార సమయంలో ర్యాలీలు, బహిరంగ సభల కోసం సంబంధిత అధికారుల అనుమతులు పొందాలన్నారు.అధికార పార్టీనాయకులు ప్రభుత్వ వాహనాలను ఎన్నికల సంబంధిత ఎలాంటి కార్యక్రమాలకు వినియోగించరాదన్నారు.
ఎన్నికల ప్రకటన( Election Notification )లకు సంబంధించి ఎంసీఎంసి అనుమతి తీసుకోవాలన్నారు.ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు.1950 , సి – విజిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూం 08723293024 కు కూడా ఫిర్యాదు చేయవచ్చుననీ తెలిపారు.

ఈ సమావేశంలో ఎన్.ఆనంద్ కుమార్ ,ఆర్ ఒ & రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ , సిరిసిల్ల,పి .మధుసూదన్ ,ఆర్ ఒ & రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ , వేములవాడ,బి .స్వప్న , డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ , రాజన్న సిరిసిల్ల,టి .రామకృష్ణ , డిప్యూటీ రిజిస్ట్రార్ /ఆడిట్ ఆఫీసర్ , రాజన్న సిరిసిల్ల,పి .దశరథం , డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ , రాజన్న సిరిసిల్ల, లింగంపల్లి మధుకర్ , బి .ఎస్ .పి, మల్లారెడ్డి , బి .జె .పి,ఎస్ .నాగరాజు , సి .ఐ, కొడమ్ రమణ , సి .పి .ఐ (ఎమ్ ), టి .కళ్యాణ చక్రవర్తి , ఐ ఎన్ సి, ఎండీ .ముస్తఫా , ఏఐఎంఐఎం, బి .యాదగిరి , బి .ఆర్ ఎస్, తీగల శంకర్ గౌడ్ , టిడిపి,పి .కరుణాకర్ ,వైస్సార్సీపీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube