'సైంధవ్' ఆడియో హక్కులు.. భారీ ధరకు వారికీ సొంతం!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు.ఈయన ఎప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమాలు చేస్తుంటాడు.

 Popular Music Label Grabs The Audio Rights Of Venkatesh's Saindhav, Saindhav Aud-TeluguStop.com

కానీ ఈసారి డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు.హర్రర్ స్టోరీతో ఈసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వెంకీ మామ సిద్ధం అయ్యాడు.

ఆ సినిమానే ”సైంధవ్( Saindhav )”ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ మధ్య కాలంలో వెంకటేష్ సినిమాలు ఎప్పుడు లేనంత అంచనాలు పెరిగాయి.అందుకు కారణం డైరెక్టర్ అని కూడా చెప్పాలి.

హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను గురించి అందరికి తెలుసు.మరి ఈ యంగ్ డైరెక్టర్ తోనే ఇప్పుడు వెంకీ తన సినిమా చేస్తున్నాడు.

శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాపై మేకర్స్ బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ డేట్ అలాగే కొత్త రిలీజ్ డేట్ ను ఈ మధ్యనే ప్రకటించారు.

మొన్నటి వరకు డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ దేవేమ్బర్ సలార్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఇప్పుడు వెంకీ సంక్రాంతి బరిలోకి వెళ్ళిపోయాడు.జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఆడియో హక్కుల గురించి అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సౌత్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ( Santhosh Narayanan )అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుండగా.ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube