బాధ్యతలే తప్ప హక్కులు లేవా: కాంగ్రెస్ పై అనుబంధ సంఘాల అసంతృప్తి ?

పార్టీకి కష్ట కాలంలో వెన్నంటి ఉండి పార్టీ కోసం పనిచేసిన మాకు ఎన్నికల సమయంలో మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు అంటూ వాపోతున్నారు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్( Congress Party ) ఇతర పార్టీల నుంచి కీలక నేతలను ఆకర్షిస్తుంది.

 Affiliate Unions Discontent With Congress For Party Tickets Details, Congress Pa-TeluguStop.com

అంతేకాకుండా పలు నియోజకవర్గాలకు కొత్త రక్తాన్ని కూడా పార్టీకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుంది.ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులకు ఇబ్బంది గా మారింది.

కాంగ్రెస్ కు ఎన్ఐసియు విద్యార్థి సంఘం, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఓబీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టి సెల్, మైనారిటీ సెల్ ఇలా అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి.

ఆయా సంఘాలకు చైర్మన్లు కూడా ఉన్నారు.

ఇప్పుడు వారందరూ వచ్చే ఎన్నికలకు టిక్కెట్లు( Congress Tickets ) వస్తాయనే ఆశతో దరఖాస్తులు కూడా చేసుకున్నారు.గెలుపు గుర్రాల కోసం చూస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు వీరికి టిక్కెట్లు కేటాయించడం కత్తి మీద సాము లాగే మారింది.

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) పార్టీకి జీవన మరణ సమస్యగా మారినందున కచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ప్రత్యక్ష ఎన్నికలలో సీటు ఇవ్వలేకపోయినా నామినేటెడ్ పదవుల లోను( Nominated Posts ) వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ల పదవులలోనూ కచ్చితంగా మీ పేరు పరిశీలిస్తామని కాంగ్రెస్ ఆయా నేతలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Telugu Assembly, Congress, Mahila Congress, Nicu, Revanth Reddy, Telangana-Telug

అయినప్పటికీ చాలా కాలం నుంచి గ్రౌండ్ లెవెల్ లో పనిచేసుకుంటూ వస్తున్న వారికి ఇప్పుడు కాంగ్రెస్ మొండి చేయి చూపించినట్లు అయింది.ఇందులో కొందరు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీలతో సంతృప్తి పడుతుండగా మరికొందరు మాత్రం రెబెల్ కాండిడేట్ గా( Rebal Candidates ) అయినా పోటీ చేయాలనే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను అరువు తెచ్చుకుటున్న కాంగ్రెస్కు ఇప్పుడు సొంత పార్టీ నేతలను ఊరడించడం అతి పెద్ద సమస్య గా మారినట్టుగా తెలుస్తుంది.

Telugu Assembly, Congress, Mahila Congress, Nicu, Revanth Reddy, Telangana-Telug

అయితే మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి టికెట్లు ఇస్తే వారు రేపు ఎన్నికల ఫలితాలు తారుమారైతే మాత్రం అంతే వేగంగా మళ్లీ ఇతర పార్టీలలోకి జంప్ చేస్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి .అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చే ఐదు రాష్ట్రాలు ఎన్నికలు కాంగ్రెస్కు అత్యావశ్యకం కాబట్టి కచ్చితంగా విజయం సాధిస్తారనే అంచనా ఉన్నవారినే దింపడానికి కాంగ్రెస్ సాయ శక్తులా ప్రయత్నిస్తుంది.మరి కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube