ఏపీ వ్యాప్తంగా ఈనెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఈ బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రతి రోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు.ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో ప్రతి రోజూ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.
ఈ సభల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.అదేవిధంగా డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అలాగే ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలిపారు.ఇందులో భాగంగా ప్రజలకు మరింత మంచి జరగాలంటే జగనే కావాలని వివరిస్తామని చెప్పారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.